న్యూఢిల్లీ: లోక్‌సభలో తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్న స్పీకర్ ఓం బిర్లా తనకు మైక్ ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మైక్ ఇవ్వమంటే స్పీకర్ పారిపోతున్నారని అన్నారు. ఇది సభ నడిపే పద్ధతి కాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా స్పీకర్ తనపై అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘మేము ఏం చెప్పాలి అని అనుకుంటున్నామో అది చెప్పాలి కదా.. అందుకు మైక్ ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. నేను ఏం చేయకుండా నిశ్శబ్ధంగా కూర్చున్నాను. 7-8 రోజులుగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర జరుగుతోందని.. ప్రధాని కుంభమేళ గురించి మాట్లాడిన రోజు తాను నిరుద్యోగం గురించి మాట్లాడుదాం అనుకుంటే.. అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఈ స్పీకర్ విధానం అర్థం కావడం లేదని.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ధ్వజమెత్తారు.
లోక్‌సభ స్పీకర్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
- Advertisement -