Friday, January 10, 2025

మోడీ మౌనం వీడు.. క్షమాపణ చెప్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తొమ్మిదేళ్లుగా దేశ ప్రజలకు చేసిందేమీ లేదు. పైగా చేయనిది చేసినట్లుగా గొప్పగా చిత్రీకరించుకుని ప్రధాని మోడీ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ బహిరంగ ద్రోహానికి ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి ఉందని కాంగ్రెస్ అధ్యక్షులు , రాహుల్ గాంధీ ఇతర నేతలు డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన ఉత్సవ దినం కాకుండా దేశ ప్రజల కోసం మాఫీదివస్ పాటిస్తే మంచిదని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున విమర్శనాత్మక ‘ నౌ సాల్ నౌ సవాల్ ) ( తొమ్మిదేళ్లు తొమ్మిది సవాళ్లు ) అనే పుస్తక సంకలనం వెలువరించారు. తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ దేశంలోని కోట్లాది యువత ఉద్యోగాలను లాక్కుని విశ్వగురు అయ్యారని ఖర్గే తమ ట్వీటులో తెలిపారు. తొమ్మిదేళ్లలో బిజెపి తన మహాసౌధాన్ని ప్రజలకు తప్పుడు వాగ్దానాలతో , ప్రజల బాధలతో విస్తరించుకుందని రాహుల్ గాంధీ విమర్శించారు.

పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర సందర్భంగా పర్యటించినప్పుడు ఎదురైన అంశాల ప్రాతిపదికన సంధించిన తొమ్మిది అంశాల ప్రాతిపదికన ఈ నౌ సాల్ నౌ సవాల్ బుక్‌లెట్ తీసుకువచ్చినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ఆయన పార్టీ కమ్యూనికేషన్ విభాగం ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేసేందుకు దేశ వ్యాప్తంగా 35 నగరాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారని వివరించారు. ప్రధాని మోడీ తాము సంధిస్తున్న తొమ్మిది ప్రశ్నలకు ఈ తొమ్మిదేళ్ల పాలన దశలో జవాబులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలన్నారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ పనితీరుపై రిపోర్టుగా ఈ పుస్తకం ఉంటుందని తెలిపారు. ప్రధాని మోడీ మౌనంగా ఉండాల్సినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడాల్సిన దశలో మౌనంలోకి వెళ్లుతారని జైరాం రమేష్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News