Thursday, January 23, 2025

మోడీ ఒకే సూట్‌ను రెండోసారి వేయడం చూశారా?: రాహుల్

- Advertisement -
- Advertisement -

సాత్నా: దేశ ప్రజల జీవితాలను మార్చేందుకు కులగణన చాలా కీలకమన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దీనిని ఓ విప్లవాత్మక ముందడుగుగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఒబిసి సామాజిక వర్గంనుంచి వచ్చిన తనను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని చెప్పుకునే నరేంద్ర మోడీ ఆ సంగతిని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. మోడీ ధరిస్తున్న ఒక్కో సూటు లక్షల విలువ చేస్తుందని… అలాంటిది ఒకసారి ధరించిన సూటును ఆయన మరోసారి ధరించడం ఎ;i్పడైనా చూశారా? అని ప్రశ్నించారు. తాను మాత్రం ఓ తెల్లరంగు చొక్కా లేదంటే టీ షర్టు ధరిస్తానని చెప్పుకున్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి ఎప్‌డిఎ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే ఒబిసిలు ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలుసుకోవడానికి కులగణన చేపట్టి తీరుతామన్నారు.

రాష్ట్రంలో పథకాలను అమలు చేయడానికి, అర్హులను గుర్తించడానికి కులగణన ఓ ఎక్స్‌రేలాగా పని చేస్తుందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో 53 మంది ఐఎఎస్ అధికారులు ఉంటే ఒక్కరు మాత్రమే ఒబిసి ఉన్నారని అన్నారు. అప్పుల కష్టాల కారణంగా మధ్యప్రదేశ్‌లో 18 వేల మంది రైతులు చనిపోయారని రాహుల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పంటల బీమా పథకాన్ని ఆయన ఎద్దేవా చేస్తూ రైతుల జేబుల్లోంచి లాక్కునే డబ్బులను 16 కంపెనీలకు ఇస్తున్నారని దుయ్యబట్టారు.ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పంటలు నష్టపోయిన రైతులు ఈ పథకం కింద డబ్బులు అడిగితే ఈ కంపెనీలు అసలు ప్రకృతి విపత్తే రాలేదంటూ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని కూడా ఆయన అన్నారు. భారత్ యాత్ర సందర్భంగా తాను ఎంతో మంది డిగ్రీలుండి కూడా ఉద్యోగం లేని నిరుద్యోగులను కలిశానని ఆయన అన్నారు.

ఓ రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పని చేస్తున్న ఓ యువకుడిని నువ్వు పోర్టర్(కూలీ) కాకముందు నీ కల ఏమిటని అడగ్గా, ఇంజనీర్ కావాలనేది తన కల అని, అందుకోసం తాను ఎంతో ఖర్చుపెట్టి ఇంజనీరింగ్ చేశానని అతను చెప్పాడని రాహుల్ అన్నారు. దేశాన్ని బలోనేతం చేయగల సత్తా,అంత పనితనం యువతరంలో ఉన్నప్పటికీ ఉద్యోగ కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News