Wednesday, January 22, 2025

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక బిజెపి ఎంఎల్ సి కేశవ్ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో శుక్రవారం కోర్టు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిట్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు.

రాహుల్ గాంధీకి మాజీ ఎంపీ, ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ సోదరుడు డి.కె. సురేశ్ రూ. 75 లక్షలు విలువ చేసే తన ఆస్తిని షూరిటీ గా ఇచ్చారు. కాగా కోర్టు కేసు విచారణను జులై 30కి వాయిదా వేసింది. రాహుల్ గాంధీని స్వాగతించడానికి పార్టీ కార్యకర్తలు, అడ్వొకేట్లు కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. కోర్టు ప్రక్రియ ముగిశాక కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్ ఒకే కారులో కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. రాహుల్ గాంధీ చాలా హ్యాపీ మూడ్ లో కనిపించడమే కాక, కారులో నుంచి పార్టీ కార్యకర్తలకు చేయి ఊపుతూ వెళ్లారు దీనికి ముందు రాహుల్ గాంధీకి విమానాశ్రయంలో సిద్ధ రామయ్య, శివకుమార్ స్వాగతం పలికారు.

ఇకపోతే రాహుల్ గాంధీపై పెట్టిన పరువు నష్టం దావా విషయానికి వస్తే… కాంగ్రెస్ తన ప్రచారంలో భాగంగా బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చింది. కర్నాటకలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ ప్రాజెక్టులు ఇవ్వడానికి 40 శాతం కమీషన్ ఛార్జీ చేస్తుందని ఓ ఫుల్ పేజీ ప్రకటనలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News