Wednesday, January 22, 2025

భారత్ జోడో యాత్రలో రాహుల్ పెళ్లి ప్రస్తావన

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi Gets Marriage Proposal in Bharat Jodo Yatra

దానికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేసిన జైరాం రమేశ్

చెన్నై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఆయన వివాహం అంశం తెరపైకి వస్తుంది. రాజకీయ నేతల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న రాహుల్ గాంధీ ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చిరునవ్వుతో దాటవేస్తుంటారు. భారత్ జోడో యాత్రలో తలమునకలుగా ఉన్న ఆయనకు ఊహించని విధంగా మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది. ‘ హిలేరియస్ మూమెంట్’ అనే క్యాప్షన్‌తో ఇందుకు సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ నేత జై రాం రమేశ్ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్ర శనివారం ఉదయం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీనుంచి మొదలైంది.

మధ్యాహ్నం అదే జిల్లాలోని మందడం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఇదే సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూటీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావలసిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. మాటల సందర్భంలో ఓ మహిళ రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది.‘ మీరు తమిళనాడును ఎంతో ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని ఆ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు. ఆ మహిళ ప్రర్వాక్కయిన రాహుల్ ఆ తర్వాత చిరునవ్వు నవ్వేశారు. ఈ విషయాన్ని జైరాం రమేశ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. వారితో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ ఎంతో ఉత్సాహంగా కనిపించారని ఆయన తెలిపారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను కూడా ఆయన ఆ ట్వీట్‌కు జతచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News