న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇంటికి ఆదివారం పోలీసులు వెళ్లారు. పోలీసులు అడిగిన సమాచారాన్ని అందించడానికి తనకు కొంత సమయం కావాలని గాంధీ చెప్పారని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు”అనే వ్యాఖ్యపై రాహుల్ గాంధీకి గతంలో నోటీసు జారీ చేశారు. లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామంటూ ఆయనను సంప్రదించిన మహిళలెవరో చెప్పాలని కోరినట్లు స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. హుడా నేతృత్వంలోని పోలీసు బృందం గాంధీ 12, తుగ్లక్ లేన్ నివాసానికి చేరుకుని రెండు గంటలకు పైగా అక్కడే ఉన్నట్లు సమాచారం.
#WATCH | Congress leader Rahul Gandhi leaves from his residence after a team of Delhi police led by Special CP (L&O) Sagar Preet Hooda met him to seek information about the 'sexual harassment' victims who met him during Bharat Jodo Yatra. pic.twitter.com/4u14OYEc0z
— ANI (@ANI) March 19, 2023