Thursday, January 23, 2025

రాహుల్ కు పదవుల మీద ఆశ లేదు: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సెప్టెంబర్ 7 ప్రతిష్టాత్మకమైన దినమని, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన దినమని, అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభం చేస్తున్నారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాహుల్ గాంధీకి పదవుల మీద ఆశ లేదని, దేశం కోసం పాటు పడుతున్న వ్యక్తి అని ప్రశంసించారు. దేశాన్ని ఒక్కటిగా అఖండంగా ఉంచడానికి పోరాడుతున్నారని, కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర చేస్తున్నారని వెల్లడించారు.  కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విభిన్న తత్వాలు ఉన్న భారత దేశం ఒక్కటే అని చెప్పే ఉద్దేశంతో 3500 కిలో మీటర్లు నడిచే సహోసో పేత ఉద్యమం మొదలు పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు.

తెలంగాణలో 13 రోజుల పాటు యాత్ర చేయనున్నారని, మక్తల్ నుంచి జుక్కల్ లో  వరకు వివిధ ప్రాంతాలలో యాత్ర చేయనున్నారని,  తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జిల్లాలు, ప్రాంతాల వారీగా విడగొట్టే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. అన్ని విధాల అభివృద్ధి చేయాలని సాగే యాత్ర అని,  రాహుల్ గాంధీ ఈ రోజు రాజీవ్ గాంధీ మరణించిన చోట నివాళులు అర్పించిన అనంతరం యాత్ర మొదలు పెడుతారని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ప్రజలు ఈ యాత్రను మనస్పూర్తిగా ఆదరించాలని కొరుకుంటున్నామని, పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ లౌకిక తత్వాన్ని కోరుకునే నాయకులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి పరిపూర్ణమైన కాంగ్రెస్ వాదిగా కొనసాగుతున్నారని, ఆయన భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ జోడో అనడం సరైందని కాదన్నారు. ఆయన ఎన్ఎస్ యుఐ   నుంచి వచ్చిన నాయకుడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News