Monday, January 20, 2025

సాటివారిపై రాహుల్ మానవత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్‌కు వెళ్తుండగా, దారిలో స్కూటర్ డ్రైవ్ చేస్తూ ఒకరు కారు ఢీకొని కింద పడిపోయాడు. సోనియా నివాసం 10 జనపధ్ రోడ్ సమీపంలో ట్రాఫిక్ కొద్దిసేపు స్తంభించిన సమయంలో ఈ సంఘటన జరిగింది. రాహుల్ వెంటనే కారు ఆపి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని లేపగా, రాహుల్ స్కూటర్‌ను లేపి దెబ్బలేమైనా తగిలాయా అని పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు. డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ వ్యక్తికి కరచాలనం చేసి అక్కడ నుంచి రాహుల్ బయలుదేరారు. ఈ సంఘటన వీడియో వైరల్‌గా మారింది. రాహుల్ జననాయక్ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News