Friday, December 20, 2024

మోడీజీ… మీకు సాయం కావాలంటే మమ్మల్ని పిలవండి : రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విపక్షకూటమి ఇండియాపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ పేర్లతో తమ కూటమిని పోల్చడంపై మండిపడ్డారు. “ మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లను మా కూటమి నియంత్రిస్తుంది. బాధిత మహిళల , చిన్నారుల కన్నీళ్లను తుడవ గలుగుతుంది. ప్రజలందరికీ ప్రేమను పంచుతుంది.

మణిపూర్‌లో తిరిగి శాంతిని నెలకొల్పుతుంది. మేము భారతీయులం. ప్రధాని మోడీ మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మమ్మల్ని పిలవండి ” అని ట్విటర్ వేదికగా తెలిపారు. పార్లమెంట్‌లో మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. దీంతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నందున ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను ఇంతవరకు చూడలేదని మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

“ విపక్షాలు అధికారం లోకి రావాలనుకోవడం లేదు. ఎప్పటికీ విపక్షం లోనే ఉండాలని అవి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. పేరులో ఇండియా (ఐఎన్‌డిఐఎ) ఉంటే సరిపోదు. వారు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆ పదాన్ని ఉపయోగించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ , వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉంది” అంటూ విపక్షాలను ఉద్దేశించి ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మణిపూర్ అంశంపై చర్చలకు ప్రభుత్వం సిద్ధమని, హోం మంత్రి అమిత్‌షా మాట్లాడతారని ప్రకటించినా, విపక్ష ఎంపీలు మాత్రం నిరసన కొనసాగిస్తున్నారు. ” అని మోడీ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News