Sunday, November 24, 2024

భారత్‌లో పన్ను వ్యవస్థ నిరుపేదల దోపిడీకే:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం పన్నుల వ్యవస్థ ‘నిరుపేదలను దోచుకునేందుకు’ ఉద్దేశించినది అని రాహుల్ విమర్శించారు. ఝార్ఖండ్ ధన్‌బాద్‌లో ఒక ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, ‘భారతీయ పన్నుల వ్యవస్థ నిరుపేదలను దోచుకునేందుకే. అదానీ మీతో సమానంగా పన్నులు చెల్లిస్తుంటారు. ఒక లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ధారవి భూములను ఆయనకు దత్తం చేస్తున్నారు’ అని ఆరోపించారు. రాహుల్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా తూర్పారపట్టారు.

‘ప్రధాని మోడీ సీప్లేన్లలో ప్రయాణిస్తుంటారు, సముద్రం లోపలికి వెళుతుంటారు, కానీ నిరుపేదలు, మహిళలు ధరల పెరుగుదల భారాన్ని భరిస్తుంటారు’ అని ఆయన విమర్శించారు. షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టిలు), షెద్యూల్డ్ కులాలు (ఎస్‌సిలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు) దేశ జనాభాలో 90 శాతం ఉంటారని, కానీ వారికి ప్రభుత్వ సంస్థల్లో ప్రాతినిధ్యం లేదని కూడా ఆయన ఆరోపించారు. ‘ప్రధాని మోడీ పెట్టుబడిదారులకు మాఫీ చేసిన రుణాలకు సమాన మొత్తంలో నిధులను నిరుపేదలకు మేము అందజేస్తాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News