Monday, December 23, 2024

దేశానికి బలం రైతులే: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశానికి బలం రైతులేనని, వారి సమస్యలను తెలుసుకుని, వారి అభిప్రాయాలను అర్ధం చేసుకుంటే దేశంలోని సమస్యల్లో సగం పరిష్కరించవచ్చని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హర్యానా సోనీపత్ జిల్లా మదీనా గ్రామంలో జులై 8న వరిపొలాల్లోకి వెళ్లి రైతులతో రాహుల్ ముచ్చటించారు. ఆ వీడియోను రాహుల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. 12 నిమిషాల యుట్యూబ్ వీడియోలో రాహుల్ రైతులతో, వారి కుటుంబీకులతో మాట్లాడడం కనిపించింది. పొలంలో దిగి రాహుల్ దున్నడం, వరి నాట్లు వేయడం, తరువాత రైతులతో కలిసి రొట్టె తినడం ఇవన్నీ వీడియోలో కనిపించాయి.

“ రైతులే దేశానికి ఎంతోబలం. సోనీపత్‌లో సంజయ్ మాలిక్, తస్బిర్ కుమార్ అనే ఇద్దరు రైతు సోదరులను కలుసుకున్నాను, వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఎన్నో ఏళ్లుగా కలిసే వ్యవసాయం చేస్తున్నారు. వారితోపాటు నేనూ పొలంలో దిగి వరినాట్లు వేయడంలో సహాయపడ్డాను. ట్రాక్టర్ నడిపాను. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. ఆ గ్రామం లోని మహిళలు మాపై ఎంతో అభిమానం చూపించారు. తమ స్వంత కుటుంబ సభ్యునిలా గౌరవించారు. ఇంటిదగ్గర తయారు చేసి తెచ్చిన ఆహారాన్ని ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News