Monday, December 23, 2024

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి

- Advertisement -
- Advertisement -

అధికార వ్యామోహంలో ప్రధాని మోడీ
రాహుల్‌తో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ముఖాముఖి

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వంపై జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ , బీజేపీ మాజీ నేత సత్యపాల్ మాలిక్ మరోసారి ధ్వజమెత్తారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని, అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండింటినీ నెరవేరుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖాముఖిలో సత్యపాల్ మాలిక్ అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమం ఛానెల్‌లో పోస్ట్ చేశారు.

అధికరణం 370 రద్దు కన్నా జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను తొలగించడమే స్థానికుల మనసులను అధికంగా గాయపరిచిందని సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఆ అభిప్రాయంతో ఏకీభవించిన రాహుల్ గాంధీ , భారత జోడో యాత్రలో ఈ విషయాన్ని గుర్తించానని అన్నారు. జమ్ముకశ్మీర్ సమస్యను సైనిక బలంతో పరిష్కరించలేరని, ప్రజల విశ్వాసాన్ని పొందితే ఏదైనా సాధించగలరని మాలిక్ తెలిపారు. 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుందని ఆరోపించారు. ప్రధాని మోడీ అధికార వ్యామోహంతో ఉన్నారని, ప్రతి చిన్న విషయాన్నీ ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారని ఆక్షేపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News