Friday, December 20, 2024

రాహుల్ సాధారణ కాంగ్రెస్ ఎంపి.. అంతగా హైలైట్ చేయవద్దు: లక్ష్మణ్‌ సింగ్

- Advertisement -
- Advertisement -

భోపాల్: రాహుల్ గాంధీ సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్త, పార్టీ ఎంపీ, అంతగా హైలైట్ చేయనవసరం లేదని మాజీ కాంగ్రెస్ ఎంపీ లక్ష్మణ్‌సింగ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌కు లక్ష్మణ్‌సింగ్ సోదరుడౌతారు. మధ్యప్రదేశ్ లోని గుణ సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖాన్ని టీవీల్లో అంతగా చూపించడం లేదని విలేఖరులు ప్రశ్నించగా.. “రాహుల్ గాంధీ ఒక ఎంపి, పార్టీ అధ్యక్షుడు కాదు, కేవలం కాంగ్రెస్ కార్యకర్త. ఇంతకు తప్ప ఆయన మరేం కాదు . మిగతా పార్టీ ఎంపీలతో ఆయన సమానం” అని లక్ష్మణ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అయిదుసార్లు ఎంపీ, మూడుసార్లు ఎమ్‌ఎల్‌ఎ అయిన లక్ష్మణ్‌సింగ్.. “పుట్టుకతో ఎవరూ పెద్దవారు కారు. వారి పనుల బట్టే అవుతారు. అలాంటి పెద్ద నాయకునిగా ఆయనను పరిగణించవద్దు” అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News