Monday, December 23, 2024

రాటుదేలుతున్న రాహుల్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కితాబు
కష్టపడుతూ సరికొత్త ఇమేజ్ పొందారు
గుండె ధైర్యమున్నడే నాయకుడు
దేశంలో ప్రజాస్వామ్యం భేష్ ..దిల్‌ఖుష్

ముంబయి : కాంగ్రెస్ నేత ఘననీయ పరివర్తన సాధించారని బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కొనియాడారు. ఇంతకు ముందటి రాహుల్ వేరు , ఇప్పటి రాహుల్ వేరని, ఈ విధంగా ఆయన తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారని సైఫ్ వ్యాఖ్యానించారు. ఇండియా టుడే ముంబై కాన్‌క్లేవ్ 2024 లో పాల్గొన్న ఈ నటుడు ప్రస్తుత రాజకీయాలలో కీలక పాత్రలో ఉన్న రాహుల్ గురించి కూడా స్పందించడం కీలక చర్చనీయాంశం అయింది. తన పట్ల ప్రజల మనోభావాలను, దృక్పథాన్ని మార్చుకునేలా రాహుల్ ఈ మధ్య కాలంలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రజలు నేతల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఏమనుకుంటున్నారు? అనేది వారి తదుపరి ప్రభావాన్ని ఖరారు చేస్తుందని ఖాన్ విశ్లేషించారు.

తనకు రాజకీయాల గురించి ఆసక్తి ఉంది. తాను నిజాయితీ, ధైర్యంగా వెళ్లే రాజకీయ నాయకులను ఇష్టపడుతానని స్పష్టం చేశారు. మరి దేశంలో ఇప్పుడున్న ప్రముఖ నేతలలో మోడీ, రాహుల్, కేజ్రీవాల్ వీరిలో ఎవరు ధైర్యవంతులు? దేశానికి తగు విధంగా నాయకత్వం వహించగలరు? అని ఇండియా టుడే ప్రశ్నించింది దీనికి ఆయన వీరంతా గుండెధైర్యం ఉన్న నేతలే అని ఎటూ మొగ్గుచూపకుండా తెలిపారు. ఇక రాహుల్ విషయానికి వస్తే ఇంతకు ముందటి వరకూ తాను ఆయన మాటలు , చేతలతో ఆయన అంటే పెద్దగా గౌరవం ఉండేది కాదన్నారు.

అయితే ఇటీవలి కాలంలో రాహుల్ తనను తాను సవరించుకుని, ప్రజలు తన నుంచి ఏది వద్దనుకుంటున్నారో వాటిని వదిలేసి, వారి స్పందనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని,ఈ పరిణతిని తాను గమనించినట్లు చెప్పారు. రాహుల్ బాగా కష్టపడుతున్నారు. అదీ చాలా ఆకట్టుకునే రీతిలో సాగుతున్నాడని వివరించారు. ఇక తన వైఖరి రాజకీయాలకు అతీతంగా ఉంటుందన్నారు. తాను నేతను కానని, రాజకీయాల్లోకి చేరే ఆలోచన ఏదీ లేదని దిగ్గజ క్రికెటర్ నవాబ్ అలీఖాన్ పటౌడీ కుమారుడు అయిన సైఫ్ చెప్పారు. ఇక నేతలలో తన మద్దతు ఎవరికి? తన రాజకీయ వైఖరి ఏమిటీ? అనేవి తాను చెప్పదల్చుకోలేదన్నారు.

అయితే దేశం జనం అనేక విషయాలపై స్పష్టతతో ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం సజీవం, సుభిక్షంగా ఉండటం తనకు సంతోషకరమన్నారు. తన దృష్టిలో జర్నలిస్టులు నిజానికి ధైర్యవంతులు, ఈ విషయంలో జర్నలిస్టులు తనను మించిపొయ్యారని చమత్కరించారు. ఇక తనకు రాజకీయ వేడి పడదన్నారు. కానీ రాజకీయాల్లో తనకు ఆసక్తి ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఏదో ఒక పార్టీలో చేరేవాడిని. ఇప్పటికైతే తాను ఈ పని చేయదల్చుకోలేదు. చేయను. చేస్తే ఇది సీరియస్‌గానే ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News