Thursday, January 23, 2025

రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని: సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, వయనాడ్ నుంచే ఆయన 20 ఏళ్లుగా ప్రధానిగా ఉంటారని, వయనాడ్ ప్రజలు ఎంపీ కోసం ఓటు వేయడం లేదని, ప్రధాని పదవి కోసం వేస్తున్నారని తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ 10 ఏళ్లు వారణాసి నుంచి ప్రధానిగా ఉంటే, రాహుల్ గాంధీ 20 ఏళ్లు వయనాడ్ నుంచి ప్రధానిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌తో పాటు కెసి వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజా ఎంపి నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేశారని, గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆయన కాకుంటే ఇంకెవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు.

ఈవీఎంలు లేకుండా బిజెపికి 180 సీట్లు కూడా రావని ప్రియాంకాగాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నరేంద్ర మోడీ, ఈవీఎంలు ఉన్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదని బీజేపీ నేతలే చెబుతున్నారని ఆరోపించారు. ఈవీఎంలపై తమకు అనుమానం ఉందన్నారు. ఈవీఎంలు తీసేయడానికి ప్రధాని మోడీకి ఎందుకు భయమవుతోందని ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎందుకు ఎన్నికలు జరపడం లేదన్నారు. ఈవీఎంలతో ప్రధాని మోడీకి ఏం సంబంధం ఉందని, బిజెపికి ఎందుకు భయమవుతోందని అడిగారు. ప్రపంచం మొత్తం పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తుంటే, భారత్‌లోనే ఈవీఎంలను ఉపయోగిస్తున్నారన్నారు. మీరు పేపర్ బ్యాలెట్ ఉపయోగించి పరీక్ష నిర్వహించాలని, తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, పేపర్ బ్యాలెట్ ఉపయోగించడం ద్వారా నిజమేంటో తెలుస్తుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News