Friday, November 22, 2024

కేరళలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

అళప్పుళ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం కేరళలో తన 13వ రోజు భారత్ జోడో యాత్రను ఇక్కడి చెర్తల నుంచి వేలాదిమంది పార్టీ కార్యకర్తలు వెంటరాగా ప్రారంభించారు. కేరళ పిసిసికి చెందిన పర్యావరణ విభాగం శస్త్రవేది ఆధ్వర్యంలో సెయింట్ మైఖేల్స్ కళాశాల ఆవరణలో మొక్కను నాటి రాహుల్ తన పాదయాత్ర ప్రారంభించారు. చెర్తల నుంచి కుతియతోడు వరకు 15 కిలోమీటర్లు ఈ యాత్ర సాగింది. 12 రోజుల పాదయాత్ర 255 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఇన్‌చార్జ్ కమ్యూనికేషన్స్ జైరాం రమేష్ తెలిపారు. అళప్పుళ జిల్లాలో చెర్తల నుంచి కుతియతోడు వరకు 15 కిలోమీటర్లు నేడు పాదయాత్ర సాగినట్లు ఆయన తెలిపారు. కోచ్చి జిల్లాలో రాత్రి బస చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధరన్, పవన్ ఖేరా, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్, షానిమోల్ ఉస్మాన్ తదితరులు నేడు రాహుల్ వెంట నడిచారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం కేరళలోకి ప్రవేశించింది. కేరళలో ఆయన ఏడు జిల్లాల మీదుగా 450 కిలోమీటర్లలో 19 రోజుల పాటు పాదయాత్ర సాగిస్తారు. అక్టోబర్ 1న కర్నాటకలోకి యాత్ర ప్రవేశిస్తుంది.

Rahul Gandhi Jodo Yatra continues 13th day in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News