అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వరుసగా మూడో రోజు గురువారం కొనసాగింది. ఉదయం యెమ్మిగనూరు మండలం బనవాసి గ్రామం నుంచి ఆయన యాత్రను పునఃప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముగటి గ్రామం వరకు పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) చీఫ్ ఎస్.శైలజానాథ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ కె.బాపిరాజు, ఇతర నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. హాలహర్వి నుండి సాయంత్రం 6.30 గంటలకు కల్లుదేవకుంటలో కార్నర్ మీటింగ్‌కు ఆగుతుంది. రాహుల్ గాంధీ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దర్శనం చేసుకోనున్నారు. చెట్నేహళ్లిలో రాహుల్ రాత్రి బస చేయనున్నారు. కర్నూలు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 100 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర శుక్రవారంతో ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎపిలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర…
- Advertisement -
- Advertisement -
- Advertisement -