Friday, November 15, 2024

రాహుల్ పచ్చి రాజకీయ అవకాశవాది: బిజెపి ఐటి సెల్ చీఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పచ్చి రాజకీయ అవకాశవాదిగా బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాల్వీయ అభివర్ణించారు. రాహుల్ గాంధీ రెండు రోజుల మణిపూర్ పర్యలనపై గురువారం మల్వీయ స్పందిస్తూ రాహుల్ గాంధీ శాంతిదూత కాదని, పచ్చి రాజకీయ అవకాశవాది అని ఆరోపించారు.

2015-2017 మధ్య కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఓక్రం ఇబోబి సింగ్ ఉన్న కాలంలో జాతుల మధ్య హింసాకాండ చెలరేగినపుడు మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌ను రాహుల్ గాంధీ ఏనాడూ సందర్శించలేదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో మూడు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందని, ఇవి గిరిజన భూములను అధిక సంఖ్యాకులైన మీటీలు హస్తగతం చేసుకునేవిగా మైనారిటీలైన కుకీలు పైట్స్ భావిస్తున్నారని ఆయన చెప్పారు.

9 మంది యువకులు కాల్చివేతకు గురై వారి మృతదేహాలు రెండేళ్లపాటు దహనానికి కూడా నోచుకోని పరిస్థితులలో రాహుల్ మణిపూర్‌ను ఎందుకు సందర్శించలేదని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ మండుతూనే ఉండాలన్నది రాహుల్ కోరికని, అక్కడి ప్రజల కష్టాలను చూసేందుకు రాహుల్ వెళ్లడం లేదని, తన సొంత స్వార్థ రాజకీయ అజెండాతోనే మణిపూర్ వెళుతున్నారని మల్వీయ ఆరోపించారు. రాహుల్‌ను కాని, కాంగ్రెస్‌ను కాని మణిపూర్ ప్రజలు నమ్మబోరని ఆయనట్వీట్ చేశారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News