Wednesday, January 22, 2025

విదేశీ యాత్రకు రాహుల్ పయనం

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi leaves for foreign trip

జులై 17న తిరిగి రాక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం ఉదయం విదేశీ పర్యటనకు పయనమయ్యారు. ఆయన ఆదివారం తిరిగి స్వదేశానికి చేరుకుంటారని వర్గాలు తెలిపాయి. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం గమనార్హం. ఆయన పర్యటన వివరాలపై కాంగ్రెస్ పార్టీ గోప్యతను పాటించింది. అది వ్యక్తిగత పర్యటనగా మాత్రం పేర్కొంది. గురువారం(జులై 14) నాడు భారత్ జోడో యాత్ర, కాంగ్రెస్‌లో వ్యవస్థాగత ఎన్నికలపై జరగనున్న కీలక సమావేశంలో రాహుల్ పాల్గొనడం లేదు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, పిసిసి అధ్యక్షులు అందరూ హాజరవుతున్నారు. కాగా..రాహుల్ తరచు విదేశీ పర్యటనలకు వెళ్లడంపై బిజెపి విమర్శలు గుప్పిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News