Monday, December 23, 2024

నీట్‌పై లోక్‌సభలో చర్చ పెట్టండి: ప్రధాని మోడీకి రాహుల్ లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీట్ వివాదంపై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌కు సంబంధించిన అంశంపై చర్చించడానికి ప్రతిపక్షం చేసిన అభ్యర్థనను జూన్ 28న, సోమవారం కూడా పార్లమెంట్ ఉభయ సభలలో తిరస్రించారని ఆయన తెలిపారు.

ఈ అంశాన్ని ప్రభుత్వంతో చర్చిస్తానని లోక్‌సభ స్పీకర్ ప్రతిపక్షానికి హామీ ఇచ్చారని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశానికి నిర్మాణాత్మక పరిష్కారాన్ని కనుగొనడానికి చర్చించాలన్నదే తన లక్షమని ఆయన చెప్పారు. నీట్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని తాను అభ్యర్థించడానికే తాను ఈ లేఖ రాస్తున్నానని రాహుల్ తెలిపారు.

దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది నీట్ అభ్యర్థుల సంక్షేమంపైనే తమ ఆందోళనంతానని ఆయన పేర్కొన్నారు. ఇతర పరీక్షలను వాయిదా వేయడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌ను మార్చడం వంటి ప్రభుత్వ చర్యలు మ కేంద్రీకృత పరీక్ష విధానంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని రాహుల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News