- Advertisement -
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. ‘లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు’ అని రాష్ట్రపతి కార్యాలయం ‘ఎక్స్’ పోస్ట్‌లో వెల్లడించి, ఆ సమావేశం ఫోటోను పంచుకుంది. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఇది ఇలా ఉండగా. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సహాయ మంత్రి వి సోమన్నతో పాటు రాష్ట్రపతితో భేటీ అయినట్లు రాష్ట్రపతి కార్యాలయం మరొక పోస్ట్‌లో తెలియజేసింది.
- Advertisement -