Friday, December 20, 2024

పవార్‌ను కలిసిన రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గురువారం ఎన్‌సిపి వ్యవస్థాపక నేత శరద్‌పవార్‌ను కలుసుకున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గం భేటీలో పాల్గొనేందుకు పవార్ ఇక్కడికి వచ్చారు. ఈ సమావేశం ముగిసిన తరువాత రాహుల్ పవార్ నివాసానికి వెళ్లారు. ఆయనతో గంట సేపు పలు విషయాలపై మాట్లాడారు. ఎన్‌సిపిలో పరిణామాలపై కలత చెందాల్సిన అసరం లేదని , ఎమ్మెల్యేల స్థాయిలో చీలిక ఏర్పడితే పార్టీలో చీలిక తలెత్తినట్లు భావించాల్సిన అవసరం లేదని తెలిపిన రాహుల్ ఈ పరిణామంపై కలిసికట్టుగా పోరాడాల్సి ఉందని పవార్‌కు ఆయన సూచించారు. పవార్ నివాసానికి వచ్చిన రాహుల్‌కు పార్టీ ఎంపి జితేంద్ర అవాద్ స్వాగతం పలికి లోపలికి తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News