Sunday, June 30, 2024

మీరు నిష్పాక్షికంగా ఉండాలి కదా: ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై స్పీకర్‌తో రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే బాధ్యతలు చేపట్టిన తర్వాత సభలో ప్రసంగిస్తూ ఎమర్జెన్సీపై చేసిన ప్రకటన పట్ల ఓం బిర్లాకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తన అసంతృప్తిని నేరుగా తెలియచేశారు. ఓం బిర్లా బుధవారం తన ప్రకటనలో ఎమర్జెన్సీని భారతదేశంలో చీకటి కాలంగా అభివర్ణించారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు కెసి వేణుగోపాల్ గురువారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఓం బిర్లా ప్రకటనపై రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైన అనంతరం స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలసిన రాహుల్ గాంధీ తన అసంతృప్తిని నేరుగా తెలియచేశారని వేణుగోపాల్ తెలిపారు.

సభాపతి న్షిష్పక్షపాతంగా ఉండాలని రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లతో అన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బిజెపి నాయకుడో, ప్రధాన మంత్రో అలా వ్యాఖ్యానిస్తే ఏమీ కాదని, కాని సభాపతి మాత్రం నిష్పక్షపాతంగా ఉండాలని రాహుల్ అన్నట్లు వారు చెప్పారు. కాగా..ఎమర్జెన్సీని స్పీకర్ ప్రస్తావించడం పార్లమెంటరీ చరిత్ర పుటల్లో ఎన్నడూ లేదని స్పీకర్‌కు రాసిన లేఖలో వేణుగోపాల్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్ తన మొదటి విధుల్లోనే ఇలా చేయడం తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News