Wednesday, January 8, 2025

ఖర్గేతో రాహుల్ భేటీ.. కర్నాటకంపైనే మంతనాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రి ఎంపిక సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ ఆయనతో రహస్యంగా చర్చలు జరిపారు. కాగా, కర్నాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్ సూర్జీవాలా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గత ఆదివారం బెంగలూరులో జరిగిన సిఎల్‌పి సమావేశంలో కాంగ్రెస్ పరిశీలకులుగా హాజరైన పార్టీ నాయకులతో కూడా ఖర్గే విడిగా చర్చలు జరిపారు. కర్నాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డికె శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉండి లాబీయింగ్ జరుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం నాడే ఢిల్లీకి చేరుకోగా అనారోగ్య కారణాలతో డికె శివకుమార్ సోమవారం తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న డికె శివకుమార్ విలేకరుల ప్రశ్నలకు జవాబివ్వకుండా ముకుళిత హస్తాలతో విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపైనే పీటముడి బిగుసుకుంది. బిజెపి 66 స్థానాలు సాధించగా జెడిఎస్ 19 స్థానాలకే పరిమితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News