Wednesday, January 22, 2025

మణిపూర్ గవర్నర్‌తో రాహుల్ భేటీ

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: కల్లోలిత మణిపూర్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉకియితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏ సమస్యకయినా హింస సరిష్కారం కాదని, అందువల్ల మణిపూర్‌లో శాంతికోసం కృషి చేయాలని సమాజంలోని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో చోటు చేసుకున్న ఘటనలు విషాదకరమైనవని ఆయన అంటూ, ఇవి రాష్ట్రానికి, దేశానికి కూడా బాధాకరమన్నారు. ‘ మనముందున్న మార్గం శాంత ఒక్కటే. ప్రతి ఒక్కరూ శాంతి గురించి మాట్లాడాలి, ఈ దిశగా ముందుకు సాగాలి. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు నా వంతుగా ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను’ అని గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతోమాట్లాడుతూ రాహుల్ ్నరు. ‘మణిపూర్ ప్రజల బాధను నేను పంచుకుంటున్నాను.

ఇది చాలా భయంకరమైన దారుణం. మణిపూర్, దేశంలోని ప్రజలందరికీ ఇది చాలా బాధాకరమైనది’ అని ఆయన అన్నారు. గురువారం ఇంఫాల్, చురామంద్‌పేర్, మొయిరాంగ్‌లలోని పలు సహాయక శిబిరాలను తాను సందర్శించానని,అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నానని ఆయన చెప్పారు. సహాయక శిబిరాల్లో, ఆహారం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, మందులు సరఫరా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అంటూ, శిబిరాల్లో తాను కలిసిన వారంతా వీటి గురించే ఫిర్యాదులు చేశారని అన్నారు. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గవర్నర్‌తో సమావేశం కావడానికి ముందు రాహుల్ గాంధీ మణిపూర్‌లోని వివిధ పౌర సంఘాలతో సమావేశమై వారి సమస్యలను విన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News