Thursday, March 20, 2025

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో రాహుల్ గాంధీ భేటీ

- Advertisement -
- Advertisement -

భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక బంధం గురించి చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో భేటీ అయిన మరునాడే రాహుల్ గాంధీ భేటీ కావడం గమనార్హం. ఇండోపసిఫిక్ సహకారం, రక్షణ సంబంధాలను పెంచుకోవడంపై మోడీ ఆయనతో చర్చించారు. న్యూజిలాండ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఖాలిస్థాన్ అనుకూల శక్తుల అంశాన్ని కూడా మోడీ లేవనెత్తారు. విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుకు సంబంధించిన ఒప్పందాలు సహా మొత్తం ఆరు ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News