Thursday, January 23, 2025

మాన్సాలో సిద్ధు మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -
Rahul Gandhi
పంజాబ్ ఎన్నికలకు ముందు మూసేవాలా కాంగ్రెస్ పార్టీలో చేరి మాన్సా నియోజకవర్గం నుంచి పోటీచేశాడు.

ఛండీగఢ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్‌లోని మన్సా జిల్లాలోని మూసా గ్రామంలో కీర్తి శేషుడైన గాయకుడు సిద్ధు మూసేవాలా తల్లిదండ్రులను మంగళవారం కలుసుకుని పరామర్శించారు. రాహుల్ గాంధీ వెంట పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా ఉన్నారు. రాహుల్ సందర్శనకు ముందే మూసేవాలా ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మూసేవాలా తండ్రిని కలిసి పరామర్శించారు. కాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గత శుక్రవారం మూసేవాలా కుటుంబాన్ని కలిసి మాట్లాడారు. సిద్ధు మూసేవాల మే 29న హత్యకు గురయ్యాడు. ఆయన మరణంపై రాహుల్ గాంధీ ఇదివరకే ట్వీట్ కూడా చేశారు. ఇదిలావుండగా పంజాబ్ పోలీస్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News