Sunday, January 19, 2025

హేమంత్ సోరెన్ భార్యతో రాహుల్ భేటీ..

- Advertisement -
- Advertisement -

రాంచీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం రాంచీలో ఝార్కండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్‌తో భేటీ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో జెఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసిన కొన్ని రోజుల తరువాత వారిద్దరి భేటీ జరిగింది.

రాంచీలోని హెచ్‌ఇసి సముదాయంలో షహీద్ మైదాన్‌లో బహిరంగ సభకు ముందు కొన్ని నిమిషాల పాటు కల్పన సోరెన్‌తో రాహుల్ సమావేశం అయినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి) జైరామ్ రమేష్ వెల్లడించారు. శాసనసభలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జెడి, సిపిఐ (ఎంఎల్) కూటమి బిజెపి కూటమిని ‘చెప్పుకోదగిన రీతిలో ఓడించిన’ కొన్ని నిమిషాల తరువాత ఆ భేటీ జరిగిందని రమేష్ తెలిపారు. కల్పన సోరెన్‌తో రాహుల్ భేటీ అయిన ఫోటోను కూడా రమేష్ పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News