Sunday, January 19, 2025

అగ్నిపథ్‌పై రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారు:మంత్రి రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సున్నితమైన జాతీయ భద్రత అంశం, అగ్నిపథ్ పథకంపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఆరోపించారు, ఈ విషయమై పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేయడానికి తాను సిద్ధమని రాజ్‌నాథ్ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ వ్యాఖ్యల అనంతరం లోక్‌సభలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ గురించి పలు దురభిప్రాయాల వ్యాప్తికి ప్రతిపక్ష నేత ప్రయత్నించారని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చర్చకు సమాధానం ఇచ్చినప్పుడు వివరణ ఇస్తారని చెప్పారు. సున్నితమైన జాతీయ భద్రత అంశం,

అగ్నిపథ్ పథకం గురించి రాహుల్ దేశాన్ని తప్పుదోవ పట్టించజూస్తున్నారని రాజ్‌నాథ్ ఆక్షేపించారు. ‘మన జవాన్లు దేశ సరిహద్దులను రక్షిస్తుంటారు. అది మన జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం. అగ్నివీర్ అంశంపై కూడా దేశాన్ని తప్పుదోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయి. మీరు నాకు ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడు ఒక ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాజ్‌నాథ్ తెలిపారు. అగ్నివీర్ అమరుని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించినట్లు రక్షణ శాఖ మంత్రి సభకు చెప్పారని, కానీ అది బీమా చెల్లింపే తప్ప పరిహారం కాదని రాహుల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News