Monday, December 23, 2024

సుప్రీంలో రాహుల్ పిటిషన్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎంపి సీటు అనర్హత వేటు విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాని మోడీని ఇంటిపేరుతో పరిహాసం చేశాడనే కేసుతో రాహుల్‌పై అనర్హత వేటు పడింది. జైలుశిక్ష కూడా ఎదుర్కోవల్సి వస్తోంది. తన దోషిత్వంపై స్టే విధించాలనే ఆయన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. దీనిని సవాలు చేస్తూ శనివారం రాహుల్ గాంధీ తమ న్యాయవాది ప్రసన్న ఎస్ ద్వారా అప్పీలు చేసుకున్నారు. సూరత్ కోర్టు ఆయనను ఈ పరువు నష్టం దావాలో దోషిగా నిర్థారించింది. గుజరాత్ హైకోర్టు ఈ నెల 7వ తేదీన రాహుల్‌కు శిక్షపై స్టే మంజూరీకి నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

దోషిత్వ ఖరారును తప్పుపట్టడానికి ఎటువంటి ప్రాతిపదికా లేదని, ఈ దశలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు నిలిపివేత కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితితో రాహుల్ ఎంపిగా లోక్‌సభలో అడుగుపెట్టడానికి వీల్లేదు. దోషిత్వ ఖరారు జరిగితే , సుప్రీంకోర్టు నుంచి కూడా ప్రతికూలత ఎదురయితే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీకి అనర్హులు అవుతారు. ఎన్నికల ప్రచార దశలో తాను చేసిన వ్యాఖ్యలు మాటల సందర్భంలో వెలువడ్డవే తప్ప ఇతరత్రా వీటిని అన్వయించుకోవడం ఎందుకని, తనకు దోషిత్వం నుంచి ఉపశమనం కల్పించాలని రాహుల్ అప్పీలు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News