Monday, December 23, 2024

గుజరాత్ హైకోర్టుకు రాహుల్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన స్టే పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ ఆయన తాజాగా మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినకేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే.

Also Read: ముస్లింల ఓట్లు మాకు అక్కర్లేదు: కర్నాటక బిజెపి

అలాగే దీన్ని పైకోర్టులో సవాలు చేసేందుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చింది.అప్పటివరకు బెయిలు కూడా మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకొంది. అనంతరం రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన రెండేళ్ల శిక్షను నిలుపుదల చేయాలని, అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం కొట్టివేయాలంటూ రెండు పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్ పిటిషన్లను తోసిపుచ్చుతూ ఈ నెల 20 తీరుప ఇచ్చింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News