Monday, December 23, 2024

మేమొస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత తొలి గ్యారంటీ

- Advertisement -
- Advertisement -

రైతుల ఆందోళనకు మద్దతు: కాంగ్రెస్

న్యూఢిల్లీ : రైతులు తమ పంటలకు న్యాయసమ్మతమైన డిమాండ్లతో ముందుకు సాగుతున్నారని, వీరిని దమననీతితో కేంద్ర ప్రభుత్వం అడ్డుకొంటోందని కాంగ్రెస్ పార్టీ మంగళవారం విమర్శించింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతుల న్యాయబద్ధమైన డిమాండ్లకు అంగీకారం తెలిపితీరుతామని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధమైన గ్యారంటీ కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందీలో సామాజిక మాధ్యమంలో స్పందించారు. రైతుల యాత్ర కేవలం ఆరంభమే అని, ఇది వారి సమస్యల పరిష్కారం వరకూ ఆగబోదని కాంగ్రెస్ తెలిపింది.

రైతులు పండించే వివిధ రకాల పంటలకు తప్పనసరిగా గిట్టుబాటు ధరలు అందాల్సిందే అని, ఇది న్యాయసమ్మతం అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఈ అంశంపై స్పందిస్తూ రైతులకు పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని తెలిపారు, ఇకనైనా ప్రధాని మోడీ భేషజాలు వీడి రైతుల నేతలతో నేరుగా చర్చలు జరిపితీరాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతుల ఢిల్లీ చలో చారిత్రక ఘట్టం అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలిగా ప్రకటించేది కిసాన్‌న్యాయ్ గ్యారెంటీ అని రాహుల్ వెల్లడించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించింది ఏమీ లేదని , రైతులకు వాగ్దానభంగంతోనే పొద్దుగడిపిందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News