Monday, December 23, 2024

గడ్డం మాయం… రాహుల్ గాంధీ కొత్త లుక్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: భారత్ జోడో యాత్ర సందర్భంగా పెరిగిన గడ్డంతో కనిపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. వారం రోజుల బ్రిటన్ పర్యటన నిమిత్తం మంగళవారం లండన్‌లో దిగిన రాహుల్ ట్రిమ్ చేసిన గడ్డం, బ్లూ సూట్‌తో కొత్త లుక్‌లో కనిపించారు. రాహుల్ తన బ్రిటన్ పర్యటనలో భాగంగా తాను చదువుకున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లర్నింగ్ ఒఏ లిజన్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై ఉపన్యాసమిస్తారు.

యూనివర్సిటీకి చెందిన బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం విద్యార్థులతో కూడా ఆయన ముచ్చటించనున్నారు. భారత్ జోడో యాత్ర పొడవునా బారెడు గడ్డం, పెరిగిన జుట్టుతో కనిపించిన రాహుల్ గాంధీ ఆ లుక్‌ను అలాగే కొనసాగిస్తారా లేదా అనే విషయం పార్టీ వర్గాలలో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కాగా..రాహుల్ కొత్త లుక్ కాంగ్రెస్ శ్రేణులనే కాక ఆయన అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News