Sunday, January 19, 2025

రాహుల్ పిఎం అభ్యర్థి కాదు: జైరాం రమేశ్

- Advertisement -
- Advertisement -

కర్నాల్: భారత్ జోడో యాత్ర చేపట్టింది రాహుల్‌గాంధీని సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగాప్రతిపాదించేందుకు కాదని జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ శనివారం మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ప్రకారం నిర్వహిస్తున్న యాత్రగా పేర్కొన్నారు. హరియాణాలో రాహుల్ సారథ్యంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రను పురస్కరించుకుని మీడియా ప్రశ్నకు జైరాం బదులిచ్చారు. భారత్ జోడో యాత్ర ఒకరి వ్యక్తిగత యాత్ర కాదని తెలిపారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరుగుతున్న పాదయాత్ర ఎన్నికల యాత్ర కాదని స్పష్టం చేశారు. రాహుల్ ప్రధానంగా మూడు సమస్యలపై దృష్టి సారించారు. ఆర్థిక అసమానత, సామాజిక కేంద్రీకరణ, రాజకీయ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాహుల్ పాదయాత్ర నిర్వహిస్తున్నారని ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News