దేశంలో వెంటనే కులాల వారి జనగణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని ప్రధాని మోడీని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కులగణన మీరు చేస్తారా? లేక రాబోయే ప్రధాని వచ్చి చేస్తే మీరు చూస్తారా? అని ప్రశ్నించారు. కులగణన దేశవ్యాప్త డిమాండ్ అయింది. ఈ ప్రక్రియ చేపట్టాలని ఓ మీడియా గ్రూప్ సర్వే నిర్వహించింది. ఇందులో 74 శాతం మంది కులగణనకు ఓటేశారని , ఇంతకు ముందటితో పోలిస్తే ఇప్పడు ఈ డిమాండ్ పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ దీనిని మోడీ అటకెక్కించాలని అనుకుంటే , కలలు కంటే అయ్యే పని కాదని చురకలు పెట్టారు. కులగణనను ఏ శక్తి ఆపలేదు. ఇప్పటికే దీనికి అనుకూలంగా భారతీయుల స్పష్టమైన సందేశం వెలువడింది. త్వరలోనే 90 శాతం మంది వరకూ జనం కులగణన కావాలంటారని,
ఈ పని ఇప్పుడు ఆయన చేస్తే ఇది ఆయన హయాంలో జరిగిన పని అవుతుంది. లేకపోతే ఇది తరువాతి ప్రధాని ఖాతాలోకి వెళ్లుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో రాహుల్ మాట్లాడారు. ఓ మీడియా గ్రూప్ చేపట్టిన జనం నాడి సర్వేలో తేలిన ఫలితాలను రాహుల్ తమ ప్రకటనతో జతపర్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేలో 59 శాతం మంది కులగణన కావాలన్నారు. 28 శాతం వద్దన్నారు. ఇప్పుడు ఆగస్టులో జరిపిన సర్వేలో 74 శాతం వరకూ అవసరం అని, 24 శాతం వద్దని చెపుతున్నారని రాహుల్ వివరించారు.