- Advertisement -
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రముఖంగా ప్రశంసించారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించడమే కాక, జలవనరులను, అడవులను, భూమిని రక్షించడానికి విపక్షాలు సాధించిన విజయంగా అభివర్ణించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనూహ్యమని, దీనిపై సమగ్రంగా విశ్లేషిస్తామని పేర్కొన్నారు. ఎక్స్ పోస్ట్‌లో హిందీలో ఆయన తన స్పందనలు తెలియజేశారు.
ఝార్ఖండ్‌లోని ఓటర్లకు, మహారాష్ట్రలో ఇండియా కూటమికి ఓట్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు, కాంగ్రెస్, జెఎంఎం కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీని స్థానిక ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించినందుకు గర్విస్తున్నానన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ప్రియాంక కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.
- Advertisement -