Friday, December 27, 2024

ప్రజలు అధికారమిచ్చింది అల్లర్లు సృష్టించేందుకేనా? : రాహుల్

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ లోని సంభాల్‌లో న్యాయస్థానం ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరంలో సర్వే నిర్వహిస్తుండగా, హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత , కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “ సంభాల్ లో జరిగిన హింసాత్మక సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నా. బీజేపీ ప్రజలపై నిర్లక్షం వహిస్తోంది. ప్రజలు అధికారం ఇచ్చింది చీలికలు సృష్టించడానికేనా ? దేశ ప్రయోజనాలను మరిచి, మతాలు, వర్గాల మధ్య ఆ పార్టీ చిచ్చుపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి చూపడం ఆందోళనకరం. దయచేసి ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News