Sunday, December 22, 2024

నా యాత్ర ఆపలేరు

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి దేశంలో చీలికకు కుట్రలు పన్నుతున్నాయి దేశ సమైక్యత కోసమే యాత్ర : రాహుల్ గాంధీ
రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు నేటి నుంచి 3రోజులు
యాత్రకు విరామం దీపావళి వేడుకల కోసం ఢిల్లీకి రాహుల్ 27న తిరిగి మఖ్తల్ నుంచి ప్రారంభం

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భారత్ జోడో

మన తెలంగాణ/మఖ్తల్: దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడోయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఆదివారం రాయిచూర్ జి ల్లా ఎర్రమరుసు నుంచి పాదయాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ ఉదయం 9 గంటల ప్రాం తంలో కృష్ణానది బ్రిడ్జి దాటి తెలంగాణలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా కర్నాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ నుంచి తెలంగాణ పిసిసి అ ధ్యక్షుడు రేవంత్ రెడ్డి మువ్వన్నెల జెండాను అందుకున్నారు. వేలాదిసంఖ్యలో పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడం తో కృష్ణానది బ్రిడ్జి మొత్తం జనసందోహంతో నిండిపోయింది. రేవంత్ తోపాటు కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, ఎంపి ఉత్తమ్, మాజీ ఎంపి మధుయాష్కీ, మల్లు భట్టివిక్రమార్క, డిసిసి అధ్యక్షుడు వాకిటి శ్రీహరి  సైతం రాహుల్ తోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ నుంచి టై రోడ్ వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు తొలిరోజు నడిచిన రాహుల్ గాంధీ పాదయాత్రకు విరామం ప్రకటించి ఢిల్లీ పయనమయ్యారు.

జోడోయాత్రను ఎవరూ ఆపలేరు

కర్నాటక నుంచి తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశించిన తర్వాత రాహుల్‌కు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లువెత్తేలా కళాకారులతో నృ త్యా లు కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టైరోడ్ వద్ద కాసేపు ప్రజలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. భారతదేశాన్ని ఒక్కటిగా చేసేందుకు చేపట్టిన జోడో యాత్రను బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ఆపలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సుమారు పదిహేను రోజులు, వందల కిలోమీటర్లపాటు సాగనున్న పాదయాత్ర సందర్భంగా ప్ర జలందరికీ కలుసుకుని, సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారనికి కృషి చేస్తానని హామీఇచ్చారు. దీపావళి విరామం తర్వాత తిరిగి పాదయాత్రలో కలుసుకుందామన్నారు.

27ననుంచి పాదయాత్ర ప్రారంభం

తొలిరోజు సరిహద్దు నుంచి టైరోడ్ వరకు కేవలం నాలుగు కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ…ఆ తర్వాత మూడురోజులపాటు 24, 25, 26 తేదీల్లో ఢిల్లీలో దీపావలి పండుగ జరుపుకోనున్నారు. 27వ తేదీ ఉదయం 7 గంటలకు తిరిగి మఖ్తల్ పట్టణశివారులోని సబ్ స్టేషన్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. అదేరోజు ఉదయం 8 గంటలకు మఖ్తల్ లోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం బొందల్ కుంట గ్రామ గేట్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో భోజనం చేయడంతోపాటు అక్కడే వివిధ వర్గాల ప్రజలను కలు సుకుంటారు. ఆ తర్వాత మరికల్ శివారులోని పసుపుల గేట్ వద్ద రాత్రి బస ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి దేవరకద్ర నియోజకవర్గంలోకి ఎంట రవుతుంది. ప్రతిరోజూ దాదాపు 25 కిలోమీటర్లమేర రాహుల్ పాదయాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు.

భారత్ జోడో యాత్రలో అపశృతి.. ముఖ్య నేతలకు గాయాలు

రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్రలో పలువురు కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించిన మొదటి రోజు స్వాగతం పలికేందుకు పలువురు కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించిన మొదటి రోజు స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో జనాలు తరలిరావడంతో తోపులాట జరిగింది. కార్యకర్తల తోపులాటలో పలువురు ముఖ్య నేతలు కిందపడి గాయపడ్డారు. ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మహేష్‌కుమార్ గౌడ్‌లకు గాయాలయ్యాయి. పొన్నాల లక్ష్మయ్య మోచేతికి గాయమవ్వగా రక్తంతో ఇబ్బందులు పడిన పొన్నాలకు మాజీ మంత్రి గీతారెడ్డి కట్టుకట్టారు. పొన్నాల లక్ష్మయ్యను ఎఐజి హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News