Sunday, December 22, 2024

తెలంగాణలో 4వ రోజు రాహుల్ పాదయాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi Padayatra begins in Telangana

మహబూబ్ నగర్ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నాలుగో రోజు ప్రారంభమైంది. మహబూబ్‌ నగర్ నుంచి జడ్చర్ల జంక్షన్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజు 20.3 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు పాలమూరు అధ్యయన వేదిక, మైనారిటీ రిజర్వేషన్ జెఎసి, ప్రొఫెసర్‌ సుశి తారుతో రాహుల్‌ చర్చించనున్నారు. 2 గంటలకు విద్యావేత్తలతో భేటీ కానున్నారు. ధర్మాపూర్ లో ఉదయం 6గంటలకు రాహుల్ యాత్ర ప్రారంభంకాగా మహబూబ్ నగర్ పట్టణం మీదుగా యాత్ర కొనసాగనుంది. ఏనుకొండలో 10.30 గంటలకు విరామం ఉండడంతో అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో రాహుల్ లంచ్ చేయనున్నారు.  తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు. అయితే.. నేడు పాదయాత్ర సినీనటి పూనమ్ కౌర్ రాహుల్ యాత్రలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News