Sunday, November 17, 2024

అమేథిలో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi padyatra in Amethi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ‘జన్ జాగరణ్ అభియాన్’లో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాత నియోజకవర్గం అయిన అమేథిలో డిసెంబర్ 18న పాదయాత్ర చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేథి లోక్‌సభ నియోజకవర్గానికే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కానీ తర్వాత ఆయన కేరళలోని వాయ్‌నాడ్ నుంచి గెలుపొందారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అదే రోజున పాదయాత్రలో పాల్గొననున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థ చెత్త నిర్వహణకు వ్యతిరేకంగా నవంబర్ 14న ‘జన్ జాగరణ్ అభియాన్’ ప్రారంభించారు. వెన్ను విరుస్తున్న ద్రవ్యోల్బణంను ఎదుర్కొనడంలో కేంద్రం చూపుతున్న ధోరణిని ప్రజల వద్దకు తీసుకెళ్లి వారిని జాగృతం చేయడమే కాంగ్రెస్ ఈ ఉద్యమ లక్షం. నవంబర్ 29 నుంచి మొదలైన పార్లమెంటు సమావేశాల్లో కూడా దీనిపై చర్చ జరిగేలా చూడ్డానికి కాంగ్రెస్ ప్రయత్నించింది.

ఢిల్లీలో ర్యాలీ నిర్వహించడానికి అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ‘మెహంగాయ్ హఠావో ర్యాలీ’ (ధరల పెరుగుదలను నిర్మూలించండి అంటూ చేపట్టిన ర్యాలీ)ని నిర్వహించింది. ‘అందులో రాహుల్ గాంధీ నిత్యావసర వస్తువులు అయిన గ్యాస్ సిలిండర్, గింజ ధాన్యాలు, నెయ్యి, పిండి, చక్కెర ధరలు 2014లో ఎలా ఉండేవో, నేడు ఎలా ఉన్నాయో పోల్చి చెప్పారు. వాటి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి’ అని వేణుగోపాల్ తెలిపారు. ర్యాలీలో రాహుల్ గాంధీ ‘అచ్చే దిన్ ఆయే?’అని ప్రజలని ప్రశ్నించినప్పుడు, చాలా మంది వ్యంగ్యంగా ‘అచ్చే దిన్ ఆ గయే, హమ్ దో హమారే దో కే’ అన్నారు. ‘దేశంలో అన్నింటినీ కొందరు పారిశ్రామికవేత్తలకు అప్పగించేస్తున్నారు’అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. రాహుల్ గాంధీ ఉత్తర్‌ఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబర్ 16న బహిరంగ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. 1971నాటి బంగ్లాదేశ్ విమోచన దినం స్మారకార్థం ‘విజయ్ దివస్’ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News