Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీ భావోద్వేగ నివాళి..(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు రాహుల్ గాంధీ భావోద్వేగ నివాళి అర్పించారు. ఆదివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉన్న తన తండ్రీ సమాధిపై పూలమాలలు వేసి రాహుల్ గాంధీ నివాళులర్పించారు. రాహుల్ తోపాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలు రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ .. ‘పాపా, మీరు నాతోనే ఉన్నారు, మీరే స్ఫూర్తి, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి’ అంటూ భావోద్యవేగ ట్వీట్ చేస్తూ తన తండ్రికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

కాగా, తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో 1984 అక్టోబర్ లో రాజీవ్ గాంధీ దేశ ప్రధాని పదవిని చేపట్టారు. అయితే, 1991 మే 21న తమిళ నాడులోని శ్రీపెరుంబుదూరులో పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో రాజీవ్ గాంధీ, ఎల్‌టీటీఈ సూసైడ్ బాంబర్ దాడిలో కన్నుమూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News