Wednesday, January 22, 2025

నెహ్రూ వారసత్వం ఒక దీపస్తంభం : రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వం ఒక దీపస్తంభంలా నిలిచి, దేశం ఆలోచనలు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశవంతం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శాంతివన్‌లో నెహ్రూ స్మారక చిహ్నాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెసి వేణుగోపాల్, పవన్ బన్సాల్, తదితరులు ఉన్నారు.

అనేక మంది కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ద్వారా నెహ్రూకు శ్రద్ధాంజలి ఘటించారు. 1899లో జన్మించిన నెహ్రూ దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పాలించారు. 1947 ఆగస్టు నుంచి 1964 మే వరకు ప్రధానిగా ఉన్నారు. 1964 మే 27న ఆయన దివంగతులయ్యారు. పండిట్ నెహ్రూ సేవలు స్మరించనిదే 21 వ శతాబ్ద భారతం లేదని మల్లికార్జున్ ఖర్గే హిందీలో ట్వీట్ చేశారు. ఆయన ప్రగతిశీల భావాలు అనేక సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి వైపు ముందుకు నడిపించాయని శ్లాఘించారు. “హింద్‌కే జవహర్‌”కు నా వినయపూర్వక నివాళి అని ట్వీట్ చేశారు.

దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఆధునికత కోసం తన జీవితాన్ని నెహ్రూ అంకితం చేశారని రాహుల్ ట్వీట్ చేశారు. ఆయన విజన్, విలువలు ఎల్లప్పుడూ మన చేతన, చర్యలకు మార్గనిర్దేశం చేస్తుంటాయన్నారు. నెహ్రూపై చిత్రాన్ని తన ట్వీట్‌కు టాగ్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన ట్విటర్‌లో నెహ్రూ ఆడియో వీడియో చిత్రాన్ని షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా కూడా నివాళులు అర్పించింది. భారత దేశ ఆధునిక దేవాలయాల తోపాటు ఐఐటిలు, ఎఐఎంలు, డిఆర్‌డిఒ, దేశ పారిశ్రామిక అద్భుతాలు నుంచి న్యూక్లియర్, స్పేస్ రీసెర్చి రంగాల్లో ముందడుగు వేయించారని కాంగ్రెస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News