Monday, December 23, 2024

రానురానంటున్న రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 18వ లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరవుతారు?అనేది ఇప్పటికీ తేలని అంశం అయిం ది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈసారి లోక్‌సభలో ఈ బాధ్యత స్వీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భే టీలో ఆయన ఈ కీలక స్థానం స్వీకరించాలని తీ ర్మానం కూడా వెలువరించింది. అయితే దీనిపై త న నిర్ణయం ప్రకటించకుండా ఉన్న రాహుల్ ఈ పదవికి దూరంగానే ఉంటారని ఆయన సన్నిహితులు తెలియచేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయం, ప్రత్యేకించి యుపి లో తుడిచిపెట్టుకుపోవడం వంటి పరిణామాలతో రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించలేదు.

అప్పటి నుంచి ఏ పదవి తీసుకోకుండా ఉంటూ వస్తున్నారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, మిత్రపక్షాల బలం పెరిగింది. బలీయ ప్రతిపక్షం అవతరించింది. అయితే ఈసారి కూడా రాహుల్ పదవికి దూరంగా ఉండాలనే భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ ఈ బాధ్యతలు తీసుకోకపోతే ఈ పగ్గాలు ఎవరికి ఇస్తారు? అనేది చర్చకు దారితీసింది. ఈ క్రమంలో కుమారీ సెల్జా, గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీల పేర్లు పరిశీలనకు ఉన్నాయని వెల్లడైంది. ఇప్పుడు సభ బలాబలాల నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రావడం అనేది దశాబ్దం తరువాతి పరిణామం అవుతుంది. కాంగ్రెస్ సొంతంగా 99 స్థానాలు పొందింది. ప్రతిపక్ష వరుసలో అత్యధిక స్థానాల పార్టీగా అవతరించింది.

లోక్‌సభ సమావేశాల ఆరంభానికి ముందే ప్రతిపక్ష నేత ఎంపిక జరగాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఈ బాధ్యతలు తీసుకోవాలని రాహుల్‌పై సొంతపార్టీనుంచే కాకుండా మిత్రపక్షాలైన డిఎంకె, శివసేన యుబిటి , శరద్ పవార్ ఎన్‌సిపి నుంచి కూడా ఒత్తిడి వంటి అభ్యర్థనలు వెలువడుతున్నాయి. అయితే రాహుల్ దీని పట్ల నిరాసక్తతో ఉన్నట్లు తేలింది. రాబోయే రెండు మూడు నెలల్లో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతాయని, అప్పటివరకూ పదవికి దూరంగా ఉంటూ, పార్టీ పటిష్ట బాధ్యతలకు పరిమితం కావాలనేదే ఆయన ఆలోచన అని వెల్లడైంది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర దశల వారిగా ప్రజల నుంచి ఆదరణకు దారితీసింది. ప్రతిపక్ష నేత హోదా వల్ల కేబినెట్ ర్యాంక్ వస్తుంది. ఇండియా కూటమి పూర్తి సమన్వయానికి దీని వల్ల వీలేర్పడుతుంది. లుకలుకలు సంతరించుకుని ఉన్న బిజెపిని , మోడీని ఎదుర్కొనేందుకు రాహుల్ అయితేనే ధీటుగా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News