నారాయణపేట: మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను గురువారం పునఃప్రారంభించారు. యాత్రలో రాహుల్ గాంధీ ఒగ్గు కళాకారులను కలుసుకుని ఒగ్గు డోలు వాయిస్తూ అందరిలో ఉత్సాహాన్ని పెంచారు. ఈరోజు రాహుల్ గాంధీ 26.7 కి.మీ పాదయాత్ర చేసి మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ రైతులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో నవంబర్ 7 వరకు రాహుల్ భారత్ జోడో యాత్రను కొనసాగిస్తూ 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 375 కి.మీ. రాహుల్ యాత్రకు తెలంగాణ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
जहां जाओ…वहां के हो जाओ
जीवन को उनके, कुछ इस कदर जिओ।#BharatJodoYatra#ManaTelanganaManaRahulGandhi @BhattiCLP @SampathKumarINC pic.twitter.com/eSydaeGjin— Telangana Congress (@INCTelangana) October 27, 2022