Thursday, December 26, 2024

దిగ్విజయంగా భట్టి పాదయాత్ర.. రాహుల్ ప్రశంస

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ హైకమండ్ తెలంగాణపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాలపైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భట్టి విక్రమార్క పాదయాత్రపై రాహుల్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఇంఛార్జీ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం.

సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలపైన సానుకూలంగా స్పందించటం పార్టీకి కలిసొచ్చే అంశంగా నేతలు రాహుల్ కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలపైన భట్టి ఎక్కువగా దృష్టిపెట్టారని.. వాటిపైన స్పందిస్తున్న తీరుతో ప్రజల నుంచి పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని రాహుల్ కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని భట్టి ప్రకటించారు. రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క ప్రజలతో మమేకం అవుతూ యాత్ర కొనసాగిస్తున్నారు. కాగా, మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జూలై 2న ముగియనుంది.

ఖమ్మంలో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. భట్టి పాదయాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెరిగింది. అప్పటివరకు ఎవరికివారుగా ఉన్ననేతలను భట్టి పాదయాత్ర ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపైన భట్టి ప్రజల మధ్యనే ఉంటూ పోరాటం ప్రారంభించారు. అన్నివర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని, వారితో ముఖాముఖి మాట్లాడుతూ, ప్రజలతో నడుస్తూ భట్టివిక్రమార్క ప్రజలకు చేరువయ్యారు. భట్టి పాదయాత్రకు రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు హాజరై మద్దతిచ్చారు. రాష్ట్రంలోని సమస్యలపైన ఎక్కడిక్కడ స్పందిస్తూ…కాంగ్రెస్అ ధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనం ప్రజలకు వివరిస్తూ భట్టి తన యాత్ర సాగిస్తున్నారు. భట్టి ప్రజలతో మమేకం అవుతున్నతీరును అభినందిస్తూ, పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని రాహుల్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News