Tuesday, December 24, 2024

రాహుల్ పొలం బాట

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం రైతు కూలీగా మారారు. రాష్ట్ర రాజధానికి సమీపంలోని కతియా గ్రామానికి వెళ్లిన రాహుల్ అక్కడి పంటపొలాల్లోకి వెళ్లి, కొద్ది సేపు పొలం పనులు చేశారు. వరిపంట సాగులో ఉన్న రైతుకూలీలతో కలిసి పొలంలోకి దిగారు. వారితో ముచ్చటించారు. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారని పార్టీ వర్గాలు ఆ తరువాత రాహుల్ పంట పొలంలో ఉన్నప్పటి దృశ్యాల వీడియోను వెలువరించాయి. రాహుల్ వెంబడి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింఘ్‌దేవ్ ఇతర నేతలు ఉన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలుకు నడుంబిగించిందని తెలిపిన రాహుల్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతాంగం కష్టాలు తొలిగిపోతాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News