Tuesday, December 24, 2024

నిర్మల్ లో జనజాతర సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

నిర్మల్(ఆదిలాబాద్): నేడు నిర్మల్ లో జనజాతర సభ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు.  ” పేదల హక్కులను హరించి…ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దలకు బిజెపి రుణ మాఫీ చేస్తే మాత్రం ఎవరూ అడగటం లేదు. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం. ప్రతి మహిళకు రూ. 2500 బ్యాంక్ ఖాతాలో వేస్తాం. ఈ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ ఉంది. మరోవైపు భారత రాజ్యాంగాన్ని మార్చే సమూహం ఉంది. రాజ్యాంగం వల్లనే ప్రజలకు హక్కులు సంక్రమించాయి. బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారు’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News