Sunday, January 19, 2025

మోడీ అదానీకి జై కొడితే సరిపోతుంది: రాహుల్

- Advertisement -
- Advertisement -

బుండీ/ దౌసా : ప్రధాని నరేంద్ర మోడీ తరచూ భారత్ మాతా కీ జై అనడం కంటే అదానీ జీ కి జై అంటే బాగుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజస్థాన్‌లోని బుండీ, దౌసాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో ఆదివారం రాహుల్ గాంధీ ప్రసంగించారు. నరేంద్ర మోడీ కేవలం బిలియనీరు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కోసం పనిచేస్తున్నారని, మరి ఆయన ఆయనకే ( అదానీ) జిందాబాద్‌లు జై కొట్టడాలు చేస్తే సరిపోతుందని చురకలకు దిగారు. ప్రధాని మోడీ తన ఆశ్రిత పక్షపాత వైఖరితో చివరికి దేశాన్ని రెండు హిందూస్థానీలుగా చేసేలా ఉన్నారని , ఒకటి తాను కోరుకున్న అదానీ కోసం అని, ఆయన ప్రయోజనాల కోసం అని, మరోటి ఏమి లేని, ఇకపై ఏమి జరగని పేదలకు ఉద్ధేశించిన హిందూస్థానీ అని విమర్శించారు. మోడీ ఏ సభకు వెళ్లినా అందరితో చివరిలో భారత్ మాతాకీ జై అన్పించడం పరిపాటి అయింది. అయితే దీనికి బదులుగా తన దోస్తు కోసం అదానీ జీ కి జై అంటే బాగుంటుందని సూచించారు.

అదానీ గ్రూప్, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పరస్పరం ఇచ్చిపుచ్చుకునే తరహాలో నడుస్తున్నాయని, ఈ సత్యాన్ని అంతా గ్రహించాల్సి ఉందన్నారు. అదానీ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు, స్టాక్ మార్కెట్ అతలాకుతలాలు, ధరల ఖరారులు జరిగాయని కాంగ్రెస్ మండిపడుతోంది. దీనిని ఇక్కడి సభలలో రాహుల్ గాంధీ మరోసారి ప్రస్తావించారు. కుల గణన గురించి మాట్లాడుతూ మోడీకి బిజెపికి దీనిని చేపట్టే ధైర్యం లేదన్నారు. వారికి ఆ ఆలోచన కూడా రాదని తెలిపారు. అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అత్యవసరం అయిన ఈ కులాల వారి జనగణనను కేవలం రాహుల్ గాంధీ , కాంగ్రెస్ పార్టీ చేయగలవని,ఈ చిత్తశుద్ధి తమకు ఉందని ప్రకటించారు. కులాల వారి గణనల గురించి తాము డిమాండ్ చేస్తే ఇప్పుడు మోడీ కులాల ప్రసక్తి ఎందుకు? దేశంలో పేదలు ఉన్నారని చెపుతూ వస్తున్నారని గుర్తు చేశారు.

రూ 12000 కోట్ల విమానం,,రోజుకు మూడు దుస్తులు
ప్రధాని మోడీ అత్యంత విలాసవంతపు ప్రధాని అయ్యారని , ఆయన తన పర్యటనల కోసం ప్రత్యేకించి రూ 12000 కోట్లు విలువ చేసే ప్లేను కొనుక్కున్నారు. ఇక రూ 12 కోట్లు విలువైన కారులో తిరుగుతారు. రోజుకు మూడుసార్లు సూటుబూటు మారుస్తారు. వీటిని అనుభవిస్తూ దేశంలో కులాల వారి గణన గురించి తప్పించుకు తిరుగుతారని , ముఖం దాటేస్తారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News