Sunday, January 19, 2025

సిఎం పదవులలో మహిళలకు 50 శాతం కోటా

- Advertisement -
- Advertisement -

కొచ్చి : కాంగ్రెస్ పార్టీలో పార్టీ, ప్రభుత్వ పదవులలో మహిళలకు మరింతగా ప్రాధాన్యత, ఎక్కువ వాటా కల్పించాలని పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. సంస్థాగత పదవులలో మహిళలకు కీలక స్థానాలు కల్పించాలి. వచ్చే పది సంవత్సరాలలో పార్టీ తరఫు ప్రభుత్వాలలో ముఖ్యమంత్రుల పీఠాలలో 50 శాతం అంటే సగానికి సగం వీరికి కేటాయించాలని సూచించారు. శుక్రవారం ఈ కేరళ ఎంపి ఇక్కడ ఉత్‌సా పేరిట ఏర్పాటు అయిన కేరళ మహిళా కాంగ్రెస్ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. కాంగ్రెస్‌లో సమర్థులైన మహిళలు అనేక మంది ఉన్నారని, వీరిలో అత్యధికులకు ముఖ్యమంత్రుల పదవులు అలంకరించే అర్హతతో ఉన్నారని తెలిపారు. ఇప్పుడు పార్టీ తరఫున ఏ ఒక్క మహిళా ముఖ్యమంత్రి లేరు. కానీ పార్టీలో ఈ పదవులను సమర్థవంతంగా నిర్వర్తించే శక్తియుక్తులు గల మహిళలు అనేకులు ఉన్నారని, ఈ విషయం తనకు తెలుసునని చెప్పారు.

ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ కేవలం పురుషాధిక్యతల సంస్థ అని విమర్శించారు. పలు విషయాలలో ఆడవారికి మగవారితో పోలిస్తే ఎక్కువగా రాణించే శక్తి ఉంది. పైగా వారికి ఓపిక ఎక్కువ అని, మగవారితో పోలిస్తే వీరు దూరదృష్టి గలవారు. సున్నితమనస్కులు, ఇతరులబాధలను మగవారి కంటే ఎక్కువగా అర్థం చేసుకోగలరని తెలిపారు. ఇటువంటి పలు అంతర్గత బలీయ సుగుణాలు కేవలం వారి అంతర్గం అయిపోకుండా , ఇవి పార్టీ నిర్మాణ లేదా అధికార పరిపాలనా వ్యవస్థ క్రమంలో వినియోగించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చింది. అంతేకానీ దీని అమలు విషయంలో బిజెపికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పలు కారణాలు చూపి దీనిని తిరిగి అటకెక్కిస్తారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News