Monday, December 23, 2024

కులగణన జరిపేలా కేంద్రంపై ఒత్తిడి

- Advertisement -
- Advertisement -

బియోహరి : దేశం పరిస్థితిని తెలిపే ఎక్స్‌రేగా కులగణన పనికివస్తుందని, ఈ దిశలో కేంద్రం చర్యలు తీసుకునేలా చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ప్రత్యేకించి ఒబిసిలు, దళితులు, ఆదివాసీల ఆర్థిక, సామాజిక పరిస్థితి దారుణంగా ఉందని, వారు అన్ని విధాలుగా గాయపడి ఉన్నారని రాహుల్ తెలిపారు. వాస్తవిక పరిస్థితిని గ్రహించేందుకు దేశంలో కులాలవారిగా జనాభాలెక్కలు చేపట్టాల్సి ఉందన్నారు.

ఇందుకోసం ఎంతకైనా దిగి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మధ్యప్రదేశ్‌లని షాదోల్‌లోని బియోహరిలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ చెప్పారు. మనిషి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు చేపట్టే ఎక్స్‌రే వంటిదే ఆర్థిక స్థితిగతుల వెల్లడికి చేపట్టే కులగణన అని తేల్చిచెప్పారు. ప్రధాని మోడీ ఈ సెన్సస్ గురించి మాట్లాడాలంటే ఎప్పుడూ పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, సౌత్ అంటూ మాటమారుస్తారని , ముందు దీని గురించి చెప్పడం మంచిదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News